![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమోలో అమ్మాయిలంతా కలర్ ఫుల్ గా ఉన్నారు. శ్రీముఖి గెటప్ చూస్తే అస్సలు గుర్తుపట్టలేకుండా ఉంది. కిట్టి పార్టీ ఎపిసోడ్ తో ఇది రాబోతోంది. శోభా శెట్టి, ఐశ్వర్య పిస్సే, సుహాసిని, ప్రిన్సి వచ్చారు. వీళ్లంతా డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించి అలరించారు. హరి వచ్చి "సుహాసిని గారు బ్యాగ్ ఏంటి అంతుంది.. పార్టీలో మిగిలిపోయినవన్నీ పట్టుకెళ్ళడానికి తెచ్చారా " అంటూ సెటైర్ వేసాడు. ఇక శ్రీముఖి వచ్చి "బెంగళూరులో మీరిలా చేస్తుకుంటారా కిట్టి పార్టీలు " అని ఐశ్వర్య పిస్సేని అడిగింది. "నార్మల్ గా కిట్టి పార్టీస్ అంటే ఆంటీలు చేసుకుంటారు కదా నేను ఇంకా ఆంటీ కాలేదు" అనేసరికి శ్రీముఖి షాకైపోయింది. వెంటనే అవినాష్ వైపు చూసింది. అంతే అవినాష్ వచ్చి "అంటే ఈమె నీకు ఆంటీలా కనబడుతోందా " అని అడిగాడు.
శ్రీముఖి ఏమన్నా అంటుందేమో అని "సుహాసిని నీకు ఆంటీలా కనబడుతోందా" అంటూ మాట మార్చేశాడు అవినాష్. తర్వాత శ్రీముఖి కుట్టి దగ్గరకు వచ్చి "హరి విషయంలో పొసెసివ్ గా ఉంటావా " అని అడిగింది. కుట్టి అలియాస్ హేమాశ్రీ "కొంచెం" అని రిప్లై ఇచ్చింది. వెంటనే అవినాష్ పొసెసివ్ అంటే అని అడిగాడు "ఆమెకు నేనంటే ఇష్టం " అన్నాడు హరి. తర్వాత సుజిత, సంజన గల్రాని, చెంచలమ్మ, అర్చన అనంత్ వచ్చారు. "తమిళ్ నాడులో కిట్టి పార్టీని కిట్టి పార్టీ అంటారా కుట్టి పార్టీ అంటారా " అంటూ శ్రీముఖి సుజితాని అడిగింది. "ఓహ్ వావ్ ఎం జోక్ " అంటూ నవ్వేసింది. ఇక ఫైనల్ అందరి చూపు చెంచలమ్మ మీద పడింది. ఇక ఆవిడ స్టైలిష్ గా రెడీ అయ్యి రావడమే కాదు అది నేనే అంటూ స్టైల్ గా వాక్ చేస్తూ అందరినీ మెస్మోరైజ్ చేసింది.
![]() |
![]() |